చిలకలూరిపేటలో జూన్ 16న మెగా జాబ్ మేళా

చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో జూన్ 16న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమంలో 45 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన 18-45 ఏళ్ల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతనం లభించనుంది. ఆసక్తి గలవారు ముందుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

సంబంధిత పోస్ట్