చిలకలూరిపేట పట్టణంలోని 25వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి స్థానిక కూటమినాయకులతో కలిసి ప్రత్తిపాటి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులు నిర్దేశిత రోజుల్లోనే పూర్తిచేయాలని, పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు.