నాదెండ్ల మండలం అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో తాను పనిచేస్తున్న ట్రాలీలోనే డ్రైవర్ తుది శ్వాస విడిచిన సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. నాదెండ్ల ఎస్సై జి. పుల్లారావు తెలిపిన వివరాలు ప్రకారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం, వావిరాల గ్రామానికి చెందిన దంతాల వీరభద్రయ్య(60), చిలకలూరిపేట లోనే ఒక ట్రాలీకి డ్రైవర్ గా పని చేస్తున్నాడు.