పెదనందిపాడు మండలం నాగభైరవవారిపాలెంలో ఆదివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరించారు. గ్రామ సచివాలయంలో గ్రామసభ నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకొని కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు.