పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు సోమవారం కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని 16 గ్రామాల్లో సుమారు 8 వేల ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేశామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.