కరివేపాకు ప్రాసెసింగ్ ప్లాంట్‌కు రూ. 2. 20 కోట్ల మంజూరు

చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో కరివేపాకు ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద ఎస్‌బీఐ ద్వారా రూ. 2.20 కోట్ల రుణం మంజూరైంది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు లబ్ధిదారులకు రుణ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరివేపాకు విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్