అమృత్ పథకం రెండో విడత పనులు ప్రారంభం: చైర్మన్ షేక్ రఫాని

చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో అమృత్ పథకం రెండో విడత పనులు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మొదటి దశలో 48 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేసి, 4 వేల మంచి నీటి కనెక్షన్లు ఇచ్చామని, రెండో విడతలో 116 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, పనులు ముమ్మరం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రతిరోజూ ప్రజలకు తాగునీరు అందిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్