చిలకలూరిపేటలో గోవధను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గో సంరక్షకులు సోమవారం గో సమితి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. గో సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.