తిరుమల లడ్డూపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి విడదల రజిని చేపట్టిన పూజా కార్యక్రమం శుక్రవారం చిలకలూరిపేట నియోజకవర్గంలోని బోయపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉద్రిక్తతకు దారితీసింది. పూజలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా టీడీపీ శ్రేణులు ఆమె కారును అడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.