గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో గుర్తుతెలియని దుండగులు బోరు మోటార్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగి తీగలను అపహరించారు. ఈ ఘటనలో పది మంది రైతులు నష్టపోయినట్లు సమాచారం. మరమ్మతు ఖర్చులతో కలిపి సుమారు రూ. 1.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.