టింకరింగ్ కార్మికుడి మృతదేహం కలకలం

చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన టింకరింగ్ కార్మికుడు షేక్ జాకీర్ హుస్సేన్ (46) వేలూరు–జాలాది రోడ్డు పక్కన మృతదేహంగా లభ్యమైన ఘటన కలకలం రేపింది. జూన్ 1న పనికి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మంగళవారం గాయాలతో మృతిచెందిన స్థితిలో ఆయనను స్థానికులు గుర్తించారు. భార్య షేక్ సఫియా ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యనా లేక ప్రమాదమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్