లింగరావుపాలెం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

యడ్లపాడు మండలం, లింగరావుపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఓ మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. లింగరావుపాలెం వాగు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో, ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ చాకచక్యంగా పక్కకు దూకేశాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్