ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం శుక్రవారం వితంతు పింఛన్లు పంపిణీ చేయనుంది. ఈ నెలలో స్పౌజ్ కేటగిరీలో కొత్తగా చేరిన 1, 09, 155 మంది మహిళలకు రూ. 4 వేల చొప్పున నగదు అందనుంది. 2019-24 మధ్య పెన్షన్ తీసుకునే భర్తలను కోల్పోయిన మహిళలను కొత్తగా లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. కాగా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో 19 మంది పింఛనుకు అర్హులైనారు. గ్రామసభ నందు క్రొత్తగా లబ్ది పొందిన వితంతువు మహిళలకు పింఛను పంపిణీ చేయడం జరిగింది.