ఎడ్లపాడు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో, చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ రహదారి డివైడర్‌లో మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో లారీలో ప్రయాణిస్తున్న నాగమ్మ అనే మహిళా కూలీ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.

సంబంధిత పోస్ట్