ఈ నెల 17న చీరాల మండలం విజయనగర్ కాలనీలో జరుగు కారంచేడు మృతవీరుల 40వ సంస్కరణ సభను జయప్రదం చేయాలని కారంచేడు బాధిత పోరాట గ్రామ కమిటీ నాయకులు సోమవారం పిలుపునిచ్చారు. 1985, జూలై 17న కారంచేడు గ్రామంలో జరిగిన ఘటన దళిత వర్గాలకు చీకటి రోజుగా మారిందన్నారు. కారంచేడు ఉద్యమం జాతీయస్థాయి దళిత ఉద్యమానికి నాంది పలికి. ST అత్యాచార నిర్మూలన చట్టం తెచ్చిందన్నారు.