కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో చీరాలలోని కేజీఎమ్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం సాయంత్రం "ఇది అతని సంతకం", "అసత్యం" నాటికల ప్రదర్శనతో వారం రోజుల జాతీయ నాటక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మే 3వ తేదీ వరకు కొనసాగుతుంది. కళాంజలి ప్రతినిధులు బత్తుల బ్రహ్మా రెడ్డి, వలివేటి మురళీ కృష్ణ, సాంబశివ రావు, మెడబలిమి లూకా, మునీరుల్లా ఖాన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కళాభిమానులు ఈ నాటక ప్రదర్శనలను జయప్రదం చేయాలని కోరారు.