విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర ప్రదర్శనతో స్ఫూర్తి

చిన్నగంజాం మండలం కడవకుదురు జెడ్పి హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. హెచ్ఎం కె. రామారావు మాట్లాడుతూ, విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయులు విలువైన సూచనలు ఇచ్చారని, వారి ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చించారని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. హెచ్ఎం కె. రామారావు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రను ప్రదర్శించి విద్యార్థులలో స్ఫూర్తి నింపారు.

సంబంధిత పోస్ట్