జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటారు వాహనముల తనిఖీ అధికారిణి ఎన్. ప్రసన్న కుమారి మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, యువత నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే లైసెన్స్ పొంది వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్ వాడకం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.