చీరాల పట్టణంలోని రోశయ్య కాలనీలో శనివారం శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. చీరాల డిఎస్పి మొయిన్ భాష పర్యవేక్షణలో, శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత విద్యార్థులకు ఈ యాప్ వినియోగం, దాని ప్రయోజనాలు, అత్యవసర పరిస్థితుల్లో అందించే సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.