మహారాష్ట్రలో బ్యాంకు మేనేజర్‌ను కత్తితో బెదిరించి భారీ నగదుతో పరారవుతున్న కరుడుగట్టిన డెకాయిటీ ముఠాను బాపట్ల పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. సీఐ రాంబాబు పక్కా ప్రణాళికతో ఈ దోపిడీ యత్నాన్ని విఫలం చేశారు. ఆయన ప్రదర్శించిన వృత్తి నైపుణ్యాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. చీరాల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.