తుఫానుతో చేనేతపురి కాలనీ ముంపు: ఎమ్మెల్యే కొండయ్య ఆకస్మిక పర్యటన

తుఫాను ప్రభావంతో చీరాలలోని చేనేతపురి కాలనీ నీట మునిగింది. గుంట మగ్గాల్లో నీరు చేరడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్‌తో కలిసి కాలనీని సందర్శించారు. కారులో కాకుండా స్కూటీపై తిరుగుతూ నేతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంట మగ్గాల్లో నీరు చేరిన బాధితుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రామకృష్ణాపురంలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్