ఆదాయం పన్ను చెల్లింపు దారులు, వ్యాపారులు ప్రభుత్వ నూతన పన్ను విధానాలు, జిఎస్టి చెల్లింపులపై అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర జిఎస్టి సహాయ కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు సూచించారు. చీరాలలో ఆదివారం ఆదాయపు పన్ను రూల్స్ 2025, జీఎస్టీ పై చార్టర్డ్ అకౌంటెంట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఆదాయం పన్ను, జీఎస్టీ చెల్లింపులలో అవకతవకలకు పాల్పడితే భారీ జరిమానా తప్పదన్నారు.