బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసు స్టేషన్, ప్రకాశం జిల్లాలోని కొత్త పట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన ఉయ్యూరు మణికంఠ అనే 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు క్రైమ్ డిఎస్పీ జగదీష్ నాయక్ శుక్రవారం మీడియాకు చెప్పారు. అతడి వద్ద నుండి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నామని ఆయన వివరించారు. రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు.