ఇచ్చిన వాగ్దానం మేరకు నేటి నుండి చేనేతలకు ఉచిత కరెంటు అమలుకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వానికి జనసేన పార్టీ తరుపున ఉమ్మడి జిల్లా జనసేన కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. చీరాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట కట్టుబడి పని చేసే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.