తన హాస్పిటల్ కు సంబంధించిన రెంట్ అగ్రిమెంట్ వివాదం కోర్టు విచారణలో ఉన్నప్పటికీ సదరు భవన యజమాని బుర్ల వెంకట్రావు, అతని బావ పమిడి భాస్కరరావులు తనను అన్ని విధాలా వేధింపులకు గురి చేస్తున్నారని చీరాలలోని కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు ఆరోపించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన కలెక్టర్ కి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. తనకు వారి నుండి రక్షణ కల్పించాలని దేవరాజు కోరారు.