చీరాలలో శనివారం జరిగిన మత్స్యకారుల ప్రతినిధుల సమావేశంలో సముద్ర తీరాన్ని పూడ్చినవారిపై, సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి రిసార్ట్స్ నిర్మిస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అభివృద్ధి సాధన సమితి ప్రతినిధి ఆర్కే శీలం డిమాండ్ చేశారు. ఈ అంశాలపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని ఆరు తీర్మానాలు చేశారు.