చీరాల రోటరీ ఆధ్వర్యంలో క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా వేటపాలెం మండలం దేశాయిపేట నీలకంఠపురంలోని సత్రం మల్లేశ్వరరావు అనాధ వృద్ధాశ్రమానికి నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా బియ్యం పప్పు దినుసులతో పాటు, వివిధ సామాగ్రిని ప్రతినిధులు చేతుల మీదగా ఇచ్చారు. క్లబ్ ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మి ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ, హేమంత్ కుమార్, వీరాంజనేయులు, సత్రం మల్లేశ్వరరావు పాల్గొన్నారు.