మురుగు కాలు వల్ల గుర్రపు డెక్కన్ తొలగించండి చీరాల రైతులు

గత ఏడాది తుఫాను వల్ల పంట నష్టపోయిన అనుభవంతో, ఈ సంవత్సరం ముందే మురుగు కాల్వల్లోని గుర్రపుడెక్కను తొలగించి వరి పంటలను కాపాడాలని చీరాల, వేటపాలెం మండలాల రైతులు జిల్లా యంత్రాంగాన్ని కోరారు. సోమవారం కలెక్టరేట్‌ పిజిఆర్ఎస్ కార్యక్రమంలో చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి అర్జీని అందజేశారు. గత సంవత్సరం సంభవించిన మోంత తుఫాను వల్ల పందిళ్ళపల్లి, వేటపాలెం, చీరాల నగరం, చీరాల చిట్టివాడ, విజయనగర కాలనీ, ఈపురుపాలెం, బోయినవారిపాలెం వంటి పంచాయతీల పరిధిలోని 25 వేల ఎకరాలు నీట మునిగాయని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్