చీరాల: ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

చీరాలలోని టిడిపి కార్యాలయం నందు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్