చీరాల: 'పెండింగ్ డీఏలు చెల్లించాలి'

చీరాలలో సోమవారం ఎస్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు వి. ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న 3 విడతల డీఏలను చెల్లించాలని, 12వ పీఆర్సీ కోసం కమిటీ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యలను, సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.

సంబంధిత పోస్ట్