చీరాల: సావిత్రిబాయి పూలే తరతరాలకు ఆదర్శం

చీరాల పట్టణంలో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని, సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యం అని ఎమ్మెల్యే తెలియజేశారు. విద్యపై ఆమె చేసిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, స్త్రీ అంటే ఓ నీడ కాదు ఓ సృష్టి కర్త అనే భావనను సావిత్రిబాయి పూలే తీసుకువచ్చారని కొండయ్య పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్