చీరాల మండలం దేవాంగ పూరి గ్రామా పంచాయితీ ,అయోధ్యనగర్ లో అధికారులు , సిబ్బందితో కలిసి చీరాల ఎమ్మెల్యే కొండయ్య లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛను అందించారు. గ్రామంలోని ప్రతి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి మరి ఫించన్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పేదరికం లేని సమాజమే కుటమి ప్రభుత్వ లక్ష్యమని, సంపద సృష్టించి, పేదలకు పంచుతామని ఎమ్మెల్యే వెల్లడించారు.