చీరాల సొసైటీ చైర్మన్ గా కోటి కృష్ణమోహన్ గురువారం ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య ఆయనను అభినందించారు. నిత్యం రైతులకు అందుబాటులో ఉండి సొసైటీల ద్వారా వారికి మెరుగైన సేవలు అందించాలని కొండయ్య సూచించారు. సొసైటీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో సొసైటీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని పేర్కొన్నారు.