చీరాల కొత్త మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బుధవారం జరగనుండగా సరైన అభ్యర్థి కోసం టిడిపి కసరత్తు సాగిస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కొండయ్య కౌన్సిలర్లు ఉల్లిపాయల సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లతో కూడిన జాబితాను సోమవారం పార్టీ హైకమాండ్ కి పంపారు. ఇదే విషయాన్ని ఆ ముగ్గురికి ఆయన స్వయంగా తెలియజేశారు. వీరిలో ఒకరి పేరుతో సీల్డ్ కవర్ వస్తుందని, తన ప్రమేయం ఏమీ ఉండదని కొండయ్య వారికి స్పష్టం చేశారు.