చీరాలలో ఈ నెల 9, 10 తేదీలలో జరగనున్న అండర్ 18 , 20 యువతి యువకుల అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీలలో పాల్గొనే జట్టును ఎంపిక చేసినట్లు అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు వయసు ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డ్ తో శుక్రవారం స్థానిక బిఆర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు.