బాపట్ల పట్టణం నుంచి కర్లపాలెం వైపు వెళ్లే హైవే రోడ్డులో ఈగల్ టీమ్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బాపట్ల ఈగల్ టీమ్ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో అనుమానాస్పద వాహనాలను నిలిపి పరిశీలించారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.