వేటపాలెం రెవెన్యూ గ్రామంలోని సర్వోదయ కాలనీ ఇండస్ట్రియల్ ఏరియాలో, సుమారు 25 జీడిపప్పు ఫ్యాక్టరీలకు వెళ్లే లారీలు 1988 నాటి విద్యుత్ స్తంభాలు, వైర్ల మధ్య ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాయి. జీడి గింజల లోడుతో వచ్చే లారీలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు గురైతే భారీ అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల లారీలతో పాటు రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు కూడా ప్రమాదంలో పడతాయి. విద్యుత్ అధికారులు స్తంభాలను ఎత్తుగా అమర్చాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమంగా రాత్రిపూట జీడిపప్పు తరలింపుపై అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి.