తిరుమల లడ్డూ కల్తీపై అమర్తలూరులో భక్తుల నిరసన

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు వెలుగులోకి వచ్చిన దర్యాప్తు నివేదికలు భక్తుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమర్తలూరు మండలం అమర్తలూరు సెంటర్‌లో భక్తుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొని, 2019–2024 మధ్యకాలంలో రసాయనాలతో తయారైన కల్తీ నెయ్యిని ప్రసాదాల తయారీలో వినియోగించారని, దీనివల్ల భక్తుల విశ్వాసం దెబ్బతిందని అన్నారు. తిరుమల వంటి పవిత్రక్షేత్రంలో జరిగిన ఈ ఘటనపై పూర్తిస్థాయి పారదర్శక దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా భక్తులు శ్రీ అమృత్వేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లి దేవాలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్