మహిళా స్వయం శక్తితోనే ఆర్థికాభివృద్ధి ఏపిఎం

కారంచేడు మండల ఏపిఎం టి. మోహన రావు, మండల సమైక్య అధ్యక్షురాలు కె. మరియమ్మ మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అనేక రుణ సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఏసీఎల్పీ, సిఐఎఫ్, శ్రీనిధి బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్