చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన దాడుల్లో ఈపూరుపాలెం గ్రామంలోని పోతురాజు శిల వద్ద అధిక మద్యం కలిగి ఉన్న రోజా అనే మహిళను పట్టుకున్నారు. ఆమె వద్ద 12 విస్కీ బాటిల్స్ స్వాధీనపర్చుకున్నామని ఎస్సై శ్రీహరి తెలిపారు. కేసు నమోదు చేసి ఆమెపై దర్యాప్తు కొనసాగుతోంది.