చిన్న గంజాం మండలం, కడవకుదురు, గొనసపూడి గ్రామాల సమీపంలో మొతా తుఫాన్ ప్రభావంతో నీటిలో మునిగిన వరి పొలాలను, కొమ్మూరు, రొంపేరు కాల్వలను చీరాల రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ నాయుడుతో కలిసి పరిశీలించారు. 5896 ఎకరాల వరి పొలాలు నీట మునిగాయని, ఐదు రోజులుగా నీరు తగ్గలేదని మండల వ్యవసాయ అధికారిణి కలెక్టర్‌కు వివరించారు. మూడు రోజులు తర్వాత కూడా నీరు తగ్గకుంటే ఆ వరి పొలాలను నమోదు చేయాలని గ్రామ వ్యవసాయ అధికారిణికి కలెక్టర్ ఆదేశించారు. రైతులు కూడా ఆలోచించి తమ పొలాలలో నిలిచిన నీటిని తొలగించుటకు అధికారులకు సహకరించాలని సూచించారు. పొలాలలో నిలిచిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నామని రైతులకు సూచించారు. పొలాలలో నిలిచిన నీటిని ఏ విధంగా తొలగించాలన్న ప్రణాళికలు తయారు చేయాలని, డ్రోన్లను ఉపయోగించి ఎక్కడ నీటిని తొలగించే అవకాశం ఉంటే వెంటనే అక్కడ నుండి నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రొంపేరు, కొమ్మూరు కాల్వల ద్వారా ప్రవహించే నీటిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.