మంతా తుఫాన్ బాధితులకు ఉచిత పశువుల దాణా పంపిణీ

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని పాపాయిపాలెం గ్రామంలో మంతా తుఫాన్ వల్ల నష్టపోయిన పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువుల దాణా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది రైతులు లబ్ధి పొందారు. చీరాల శాసనసభ్యులు ఎం.ఎం. కొండయ్య, డాక్టర్ వేణుగోపాల్ (డిస్టిక్ యానిమల్ హస్బండ్రీ ఆఫీసర్), డాక్టర్ చిట్టిబాబు (అసిస్టెంట్ డైరెక్టర్), డాక్టర్ పుష్పలత (వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్), ఎం. వాసు (యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్) మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పాపాయిపాలెం గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్