పర్యాటకులకు శుభవార్త: సూర్యలంక-హైదరాబాద్ మధ్య కారవాన్ సేవలు ప్రారంభం

పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా, బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. సూర్యలంక నుంచి హైదరాబాద్ వరకు కారవాన్ సేవలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నూతన కారవాన్ జిల్లాకు కేటాయించబడడం పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందని, సూర్యలంక బీచ్‌తో పాటు పరిసర ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రయాణ వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ సేవలతో స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, జిల్లాకు పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చీరాల ప్రాంతంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్