తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం: మంత్రి గొట్టిపాటి

బాపట్ల జిల్లా మొంథా తుఫాన్ నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రకాశం, బాపట్ల, మచిలీపట్నంలో భారీగా నష్టం వాటిల్లింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. నీట మునిగిన పొగాకును కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్