జూలై 31 ని చేనేత దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని జాతీయ చేనేత నాయకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం ఉదయం చీరాల మండలం జాండ్రపేటలోని శ్రీ చౌడేశ్వరి దేవాలయ కళ్యాణమండపంలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వర్క్ షాప్ లో పాల్గొని ఆయన ప్రసంగించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. దేవన హేమసుందర రావు, గుంటూరు మల్లికార్జున్, సజ్జా శ్రీనివాసరావు, వావిలాల దాశరథి, మునగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.