బాపట్ల జిల్లా, కొత్తపేట పంచాయతీలో డీమార్ట్ పక్కన ఉన్న మూడో, నాలుగో లైన్లలో తుఫాను కారణంగా ఇళ్లన్నీ నీట మునిగాయి. రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటన చీరాల ప్రాంతంలో చోటుచేసుకుంది.