బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదురుగా మద్యం దుకాణం పక్కనే యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా, వ్యాపారులు ఒక్కో బాటిల్‌కు రెట్టింపు ధరలకు మద్యం అమ్ముతూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.