కారంచేడు: బైక్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు

కారంచేడు మండలం ఆదిపూడి – పూసపాడు రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనను చూసిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్