వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బుధవారం చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి వెంకటేష్ తో అన్నారు.