ఆటోను ఢీకొట్టిన లారీ

కారంచేడు–పర్చూరు రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారంచేడు నుంచి పర్చూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి, క్షతగాత్రులను చీరాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్